Home News డిగ్రీ కళాశాల లో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

డిగ్రీ కళాశాల లో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

0

చోడవరం : స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ” నిర్వహించారు.కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి కిరణ్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ సత్యవతి కార్యక్రమాల్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ గ్రంథాలయం దేవాలయం వంటివని, పుస్తకం విజ్ఞానానికి ,మనిషి ఎదుగుదలకు కళాశాల గ్రంథాలయమునకు 13 మ్యాగజైన్స్ కాంపిటేటివ్ పరీక్షల కు ఉపయోగపడేవని దీన్ని విద్యార్థులు సద్వినియోగం చేయవలసినదిగా కోరారు. సత్యవతి మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు . డాక్టర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ ఏపీజే కలాం పుస్తకాలు, మనిషి యొక్క విజ్ఞానాన్ని పెంపొందించడానికి ,వారి జీవితానికి దోహదపడుతుందని తెలియజేశారు. లైబ్రేరియన్ మాల్యాద్రి మాట్లాడుతూ జాతీయ గ్రంథాలయ పితామహుడు ఎస్ ఆర్ రంగనాథన్ సేవలకు గుర్తింపుగా ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్ ఏ పీ ఎల్ ఏ లో తీర్మానం ఆధారంగా నవంబర్ 14 నుండి 20వ తేదీ వరకు గ్రంథాలయ వారోత్సవాలు జరపాలని తీర్మానించినట్టు ,1968 వ సంవత్సరం నుండి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. లైబ్రరీ వారోత్సవాల సందర్భంగా మధ్యాహ్నం 3 గంటలకు ఎస్ఎస్సి మోడల్ ఎగ్జామ్ జరుగుతుందని విద్యార్థులు విరివిగా పాల్గొని బహుమతులు పొందవలసిందిగా కోరారు.సీనియర్ ఆధ్యాపకులు హెచ్ సుధీర్, వి. అప్పలనాయుడు, సమన్వయకర్త డాక్టర్ నారాయణ మూర్తి, డాక్టర్ మళ్ళీ బాబు , ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ బిచ్చమ్మ, డాక్టర్ జ్యోతి, డాక్టర్ కృష్ణారావు , డాక్టర్ రాధాకృష్ణ, వెంకటేష్, రామలక్ష్మి, కోమల , సరస్వతి, కామర్స్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version