అమ్మవారి అర్చన చేసిన కలములను విద్యార్థులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జ్ఞానాపురం శ్రీ శ్రీ శ్రీ ఎర్నిమాంబ అమ్మవారి దేవస్థానం లో రథసప్తమి పర్వదినం పురస్కరించుకొని సుమారు లక్ష కలములు తో అమ్మవారికి విశేష అర్చన నిర్వహించారు. ఈ సందర్భంగా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అమ్మవారి ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం అమ్మవారికి అర్చన నిర్వహించిన ఆ కలములు ను రానున్న పోటీ పరీక్షలు గాను విద్యార్థులకు అమ్మవారి ప్రసాదముగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఏడాది నుంచి ఘనంగా చేపడుతున్న స్థానిక ఈఓ సురేష్ ను అభినందించారు. కార్యక్రమంలో స్థానిక కూటమి నేతలు తో పాటు వివిధ హోదాల్లో ఉన్న ఇతర వార్డుల నేతలు పాల్గొన్నారు…
