Home Politics Andhra Pradesh అమ్మవారి పరసమహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ

అమ్మవారి పరసమహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ

0

వైభవంగా నీలమాంబ అమ్మవారి పరస వేడుక , శ్రీ శ్రీ శ్రీ నీలమాంబ అమ్మవారి 44 వ పరస మహోత్సవ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. శ్రీ నీలమాంబ అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజ అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ మాసిపోగు మేరి జోన్స్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంను తిలకించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ అమ్మవారి జాతర మహోత్సవంలో పాల్గొనే అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. అమ్మవారి జాతర మహోత్సవములు ఘనంగా నిర్వహించిన గ్రామ కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కూటమి నేతలు పాల్గొన్నారు…

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version