Home Politics Andhra Pradesh కంచి స్వామివారిని ఆలయ ప్రతిష్టకు ఆహ్వానించిన శ్రీ వేద సంస్కృతి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు.

కంచి స్వామివారిని ఆలయ ప్రతిష్టకు ఆహ్వానించిన శ్రీ వేద సంస్కృతి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు.

0

అనకాపల్లి లో శ్రీ వేద సంస్కృతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మాణ మవుతున్న శ్రీ మంత్రిణి దండిణి సహిత శ్రీ రాజరాజేశ్వరీ అమ్మవారి దేవాలయ ప్రతిష్ఠా కార్యక్రమానికి పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురు శంకరాచార్య కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ మహాస్వామివారిని ఆహ్వానిచారు ట్రస్ట్ చైర్మన్ కిరణ్ శర్మ. అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ ఏప్రిల్ 26 నుండి 30 వ తేదీ వరకు ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. స్వామివారు ఈ కార్యక్రమానికి విచ్చేస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

బుధవారం ఆయన కంచి పీఠంలో స్వామివారిని కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ఏప్రియల్ 26 నుంచి 30 వ తారీఖు వరుకు జరుగు కార్యక్రమ వివరాలను స్వామి వారికి వివరించారు.స్వామి వారి నుంచి తగిన సూచనలు అందాయని ఆయన తెలిపారు. ట్రస్ట్ చైర్మన్ కిరణ్ శర్మతో పాటు ట్రస్ట్ సభ్యులు నందన శర్మ, త్రినాథ్, కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version