Wednesday, April 22, 2026
HomePoliticsAndhra Pradeshభీమిలిలో భారీగా అన్నదానం

భీమిలిలో భారీగా అన్నదానం

ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను భీమిలి నియోజకవర్గం టీడీపీ శ్రేణులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, యువ నాయకుడు గంటా రవితేజ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని భీమిలి, తగరపువలస, మారికవలస, వాంబే కాలనీలలోని అన్న క్యాంటీన్ లలో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒక్కో అన్న క్యాంటీన్ లో వెయ్యి మంది అన్నార్తులకు ఉదయం అల్పాహారం.. మధ్యాహ్నం, రాత్రి భోజనాలను ఉచితంగా అందించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు అందజేశారు. రాష్ట్రంలోని యువతకు ఉద్యోగావకాశాలు విస్తృతం చేయడంలో భాగంగా ప్రపంచ స్థాయి ఐటీ కంపెనీలను విశాఖకు తీసుకువస్తున్న లోకేష్ కు ఈ సందర్భంగా పలువురు నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యా వ్యవస్థలో ఆయన చేపట్టిన సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. జడ్పీటీసీ గాడు వెంకటప్పడు, టీడీపీ నాయకులు చిక్కాల విజయ్ బాబు, గంటా నూకరాజు, సరగడ అప్పారావు, తాట్రాజు అప్పారావు, పిల్లా వెంకట్రావు, కె. అచ్యుతరావు, బైపిల్లి శ్రీరామూర్తి, గొలగాని నరేంద్ర, పాండ్రంగి అప్పలరాజు, నాగోతి సూర్య ప్రకాష్, తమ్మిన సూరిబాబు, కొప్పల రమేష్, దండి వెంకటేష్, గరే సదానంద, బలిరెడ్డి మల్లికార్జునరావు, నాగోతి సత్యనారాయణ, బోని ప్రసాద్, ఎం. సాయి జ్ఞానేశ్వర్, జీరు సత్యనారాయణ, నమ్మి రమణ, కె.రాజు, బాబి, కాకర సురేష్ కుమార్, కనకాల హేమంత్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments