Home Politics Andhra Pradesh శ్రీనూకాంబిక జాతర మహోత్సవాలను జయప్రదం చేయండి

శ్రీనూకాంబిక జాతర మహోత్సవాలను జయప్రదం చేయండి

0

ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ

ఉత్తరాంధ్ర ఇలవేల్పు ఆరాధ్య దైవమైన శ్రీ నూకాంబిక జాతర మహోత్సవాలను మరియు సాంస్కృతిక కార్యక్రమాలు జయప్రదం చేయాలని స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పిలుపునిచ్చారు. కొత్తమాస్య జాతర పండగను రాష్ట్ర పండగ రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన సందర్భంగా గత సంవత్సరం జాతర వైభవంగా నిర్వహించామని స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో సాంస్కృతి కార్యక్రమాలకు ప్రతిరోజ నిర్వహించడం జరిగిందని ,ఇప్పుడు కూడా ఎన్టీఆర్ గ్రౌండ్లో నెల రోజులు పాటు సాయంత్రం 6 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహిస్తున్నామని వీటిని ప్రజలు అందరూ ఆదరించి పండగను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ పండగ ఉత్తరాంధ్ర జిల్లా కాకుండా అన్ని జిల్లాల నుండి శ్రీ నూకంబిక అమ్మవారిని దర్శించుకొనుటకు భక్తులు తరలివస్తారని భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తున్నామని దేవాలయం చుట్టూరా మెరుమెట్లు గొలిపే విద్యుత్తు లైట్లు దేవాలయం చుట్టూరా తాటాకు పందిరులు. ఆలయ రాజ గోపురం, మందిరం గోపురం లు రంగురంగులతో అలంకరించడం జరిగింది అని ఈ ఉత్సవాల్లో అన్ని ప్రభుత్వ శాఖ అధికారులు సమన్వయంతో ఇక్కడ వ్యవహరించుకుంటూ ఉత్సవాల్లో ఎటువంటి లోటుబాటు లేకుండా చూసుకోవడం జరుగుతున్నదని ఆయన పేర్కొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version