Home Devotional మహాశివరాత్రి ఉత్సవాలు విజయవంతం చేయండి

మహాశివరాత్రి ఉత్సవాలు విజయవంతం చేయండి

0

వచ్చే నెల 15వ తేదీన జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాలను ప్రజలంతా జయప్రదం చేయాలని స్థానిక ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ రాజు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన చోడవరం స్వయంభు గౌరీశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో మహాశివరాత్రి ఉత్సవ ముహూర్తపు రాటను వేసి శివరాత్రి పనులు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఫిబ్రవరి 15న మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో 20 రోజులు ముందుగానే కార్యక్రమాలు ప్రారంభించేందుకు ఏర్పాటు చేస్తున్నారు ఫిబ్రవరి 13 నుంచి 18 వరకు ఈ మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తామని ఆలయ ప్రధాన అర్చకుడు కొడమంచిలి చలపతి తెలిపారు. ప్రతి ఏడది కూడా ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తుంటారు దేవాదాయ శాఖ ఆలయం ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు కూటమి నాయకులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version