చోడవరం మండలం రాయపురాజుపేటలో బుధవారం పశు ఆరోగ్య శిబిరo నిర్వహించారు.
పశు సంవర్ధక శాఖ ఆద్వర్యంలో ఈ కార్యక్రమం అడ్డూరి పశువైద్యాధికారి డాక్టర్ ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బి రామనాయుడు, రాష్ట్ర గవర్నర్ కార్పొరేషన్ డైరెక్టర్ బి నాగ గంగాధర్ ప్రారంభించారు.పాడి పశువులకు, పెయ్యలకు స్వయంగా నట్టల నివారణ మందులు అందచేశారు. ఈ సందర్భంగా రైతులకు పశు వైద్యాధికారి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాధి నిర్ధారన ప్రయోగశాల ఎల్టి పి శ్రీదేవి, రాయపూ రాజుపేట పశుసంవర్ధక శాఖ సహాయకుడు వై నాయుడు తదితరులు పాల్గొన్నారు.
