Home Politics Andhra Pradesh రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొత్తకోటలో ముగిసిన మహాశివరాత్రి ఉత్సవాలు

రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొత్తకోటలో ముగిసిన మహాశివరాత్రి ఉత్సవాలు

0

 

చోడవరం ఫిబ్రవరి 16 జయ జయహే

చోడవరం నియోజవర్గ పరిధిలో గల రావికమతం మండలం కొత్తకోట లో రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాశివరాత్రి ఉత్సవాలు సోమవారంతో ముగి సాయి.13 అడుగుల మట్టితో తయారు చేస్తున్న శివుని విగ్రహానికి ప్రత్యేక పూజలతో పాటు పురోహితులు బ్రహ్మశ్రీ వేప రామకృష్ణ కిషోర్ ఆధ్వర్యంలో శివదీక్ష చేపట్టిన సుమారు 50 మంది స్వాములతో పాటు ఇతర భక్తులతో కలిపి సామూహిక అభిషేకాలు నిర్వహించారు.ఈ శివరాత్రి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు విచ్చేసి శివుణ్ణి ప్రత్యేకంగా దర్శనం చేసుకుని గత 13 సంవత్సరాలు నుండి నిరాఘఠంగా మహాశివరాత్రి ఉత్సవాలు చేస్తున్న రాజన్న ఫౌండేషన్ చైర్మన్ జనసేన పార్టీ ఇంచార్జ్ పివిఎస్ ఎన్ రాజును అభినందించారు. అలాగే రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు రాష్ట్ర,వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి ఈర్లే శ్రీరామ మూర్తి విచ్చేసి ఎంతో భారీ ఎత్తున ప్రజల కోసం ఆధ్యాత్మి భావన పెంపొందించడం కోసం చేపడుతున్న ఈ కార్యక్రమాలు చాలా సంతోషాన్ని కలిగించాలని భవిష్యత్తులో కూడా ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలు రాజన్న ఫౌండేషన్ చేయాలని ఆకాంక్షించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version