Home Politics Andhra Pradesh ఆకాశ వీధిలో విహరిద్దాం.. అరకు ఫెస్టులో సరికొత్త అనుభూతి

ఆకాశ వీధిలో విహరిద్దాం.. అరకు ఫెస్టులో సరికొత్త అనుభూతి

0

చొంపి కొత్తవలస ఫారం వద్ద హెలికాప్టర్‌ పెరామోటింగ్ రైడ్‌ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్‌ ,అరకు ఫెస్టు వేడుకలను పురస్కరించుకుని ప్రజలకు సరికొత్త అనుభూతిని అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. ఆకాశ వీధిలో విహరించాలనుకునే వారి కోసం హెలికాప్టర్‌ రైడ్‌ తీసుకువచ్చాం అని జిల్లా కలెక్టర్‌ ఎ ఎస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం చొంపి కొత్తవలస ఫారం వద్ద హెలికాప్టర్‌ రైడ్‌ను ఆయన రిబ్బన్ కట్ చేసి , కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా ప్రారంభించారు. జిల్లా కలెక్టర్, సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారిని, సహాయ కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ అధికారి ,హెలికాప్టర్‌లో విహరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు హెలికాప్టర్‌ రైడ్‌ అందుబాటులో ఉంటుందని తెలిపారు. దీనికోసం ఒక్కొక్కరికి రూ. 4000రూ పెరమోటింగ్ ఒక్కొక్కరికి రూ. 2500/- గా నిర్ణయించామని, ఆఫ్‌లైన్‌ టికెట్ల ద్వారా ఎవరైనా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version