Home Politics Andhra Pradesh కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను గట్టిగా ప్రతిఘటిద్దాం

కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను గట్టిగా ప్రతిఘటిద్దాం

0

వైస్సార్సీపీ ప్రచార విభాగం జోన్ 1 కార్యనిర్వాహక అధ్యక్షులు జి వి రవి రాజు
ప్రజావ్యతిరేక విధానాలతో రాష్ట్రాన్ని వెనక్కి నెట్టుతున్న కూటమి ప్రభుత్వ పాలనకు గట్టిగా ప్రతిఘటించాల్సిన సమయం ఆసన్నమైందని, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరింత దూకుడుగా పోరాటానికి సిద్ధమవ్వాలని పార్టీ ప్రచార విభాగం జోన్–1 కార్యనిర్వాహక అధ్యక్షులు జి.వి. రవి రాజు పిలుపునిచ్చారు.విశాఖపట్నంలోని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో,మంగళవారం జి వి రవిరాజు అధ్యక్షతన జిల్లా పార్టీ కార్యవర్గంతో నిర్వహించిన సమావేశంలో, జనవరి 31వ తేదీన జరగనున్న పార్టీ ప్రచార విభాగం జోన్–1 సమావేశాన్ని చారిత్రాత్మకంగా విజయవంతం చేయాలని, అలాగే గత వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన సంక్షేమ–అభివృద్ధి పథకాల విజయాలను ఇంటింటికీ తీసుకువెళ్లేలా దూకుడైన ప్రచార వ్యూహాలు అమలు చేయాల్సిన అవసరంపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా ప్రచార విభాగం అధ్యక్షులు జీలకర్ర నాగేంద్ర, జిల్లా జనరల్ సెక్రటరీలు శ్రీనివాస పత్రో, వి. జ్యోతి ప్రకాష్, వై. అప్పారావు యాదవ్, షేక్ బాషా, కె. సత్తిబాబు, కంచు మూర్తి ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శులు బోరా కుమార్ రెడ్డి, పరవాడ ఈశ్వరరావు, ఈస్ట్ నియోజకవర్గ అధ్యక్షులు ఎస్. సురేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version