Home News కొయ్యూరు తాహసిల్దార్ ప్రసాద్ ఆకస్మిక మృతి

కొయ్యూరు తాహసిల్దార్ ప్రసాద్ ఆకస్మిక మృతి

0

అల్లూరి జిల్లా కొయ్యూరు మండల తాహసిల్దార్‌ ఎస్.ఎల్.వి. ప్రసాద్ మంగళవారం ఆకస్మికంగా మృతి చెందారు. ఈ ఘటనతో జిల్లా వ్యాప్తంగా తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా నర్సీపట్నం ఆర్డీవో కార్యా లయంలో సిబ్బందిగా పని చేసిన ఆయన ఇటీవలే బదిలీపై అల్లూరి జిల్లాకు వెళ్లారు. అనంతరం కొయ్యూరు మండల తాహసిల్దార్‌గా బాధ్యతలు స్వీకరించి ప్రజలతో మమేక మై సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తూ అందరి మన్ననలు పొందారు అయితే స్వస్థల మైన నర్సీపట్నంలో ఉన్న సమయంలో అనారోగ్యానికి గురై అకస్మాత్తుగా మృతి చెందారని సమాచారం. ఆయన మృతి వార్త తెలి యడంతో కుటుంబ సభ్యులు స్నేహితులు, సహచరులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తాహసిల్దార్ ప్రసాద్ మృతి పట్ల ప్రభుత్వ అధికారులు,ప్రజా ప్రతినిధులు,ఉద్యోగ సంఘాలు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. నిజాయితీ గల అధికారిగా మంచి గుర్తింపు పొందిన ఆయన అకాల మరణం తీరని లోటుగా చెప్పుకుంటున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version