Home Editorials జయహే పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన డిఎస్పీ

జయహే పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన డిఎస్పీ

0

పత్రికా రంగానికి, పోలీసు వ్యవస్థకు అవినాభావ సంబంధం ఉందని డీఎస్పీ సాయి ప్రశాంత్ అన్నారు.
స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అవగాహన సదస్సులో జయ జయహే దిన పత్రిక క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్బంగా రంపచోడవరం
సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (డిఎస్పీ ) సాయి ప్రశాంత్ మాట్లాడుతూ సమాజంలో పత్రికల పాత్ర కీలకమైనదని చెప్పారు.సమాజంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయడంలో పత్రికలు కీలక పాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు.శాంతిభద్రతల పరిరక్షణలో పత్రికలు పోలీసు యంత్రాంగానికి వారధిలా పనిచేస్తున్నాయని, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడం ద్వారా నేర నియంత్రణకు దోహదపడుతున్నాయని అన్నారు. జయహే అనే మంచి టైటిల్ తో మీ పత్రిక ఉందని , సమాజంలో జరుగుతున్నా అసమానతలను వెలికి తీయడంలో మీ పత్రిక ముందుండాలని ఆశించారు.సమస్యలను లేవనెత్తే గళంగా పనిచేయాలని , ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ మరిన్ని మంచి కథనాలతో ఏజెన్సీలో అందరికి సుపరిచితం కావాలని ఆకాంక్షించారు.ప్రజలకు సమాచారాన్ని అందించడమే కాకుండా, ఇలాంటి క్యాలెండర్ల ద్వారా సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతి ఇంటా గుర్తు చేయడం శుభపరిణామని చెప్పారు.ఈ కార్యక్రమంలో సిఐ టిజిఎన్ ప్రసాద్ , మారేడుమిల్లి , గుర్తేడు ఎస్ఐ లు శ్రీనివాస్ , రాజ్ కోటి , పోలవరం జిల్లా జయహే పత్రిక ఇంచార్జి అజిత్ కోర తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version