Home Uncategorized కేజీహెచ్‌లో కక్కుర్తి వేషాలు

కేజీహెచ్‌లో కక్కుర్తి వేషాలు

0

ఉద్యోగాల ఎరతో బురిడీ కొట్టిస్తున్న లేడీ డాన్
– జయ జయహే వార్తలకు భయపడి రూ. లక్ష వెనక్కి కొట్టిన వైనం
– ఉన్నతోద్యోగంలో ఉండి కూడా లాగిస్తున్న లంచాలు
– చాంతాడులా పెరుగుతున్న బాధితులు

జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయం నుంచి బదిలీపై వెళుతూనే అవినీతి దందా ఖాతాను కేజీహెచ్‌లో తెరిచారు. ఫైళ్ల పరంగా పనేమీ చేతకాకపోయినా కింది ఉద్యోగులను భయపెట్టి…బెదిరించి మరీ అక్రమ దందాను కొనసాగించే లేడీ డాన్ అవినీతి బాగోతాలను పలువురు బాధితులు ‘జయ జయహే ప్రతినిధి’ కి అందజేశారు. బాధితులు అందజేసిన వివరాల మేరకు ఆమె అవినీతి చిట్టా చాంతాడులా పెరుగుతూనే వుంది. తవ్వే కొద్వీ అక్రమ లావా దేవీల గుట్టు బయట పడుతూనే ఉంది. బాధితుల సంఖ్య డజన్ల కొద్దీ పుట్టుకొస్తున్నారు. విశాఖ డీఎం అండ్‌ హెచ్ వో కార్యాలయం నుంచి మొదలు పెడితే బాథితుల సంఖ్య వందల్లో ఉందంటే ఆమె ఏ రేంజ్‌లో అవినీతికి పాల్పడ్డారో ఊహించుకోవచ్చు. ఇప్పటికీ ఆమె చుట్టూ డబ్బులు ఇచ్చేయమని తిరిగే బాధితులున్నారంటే డబ్బులు ఏ రేంజ్‌లో వసూలు చేశారో అర్ధం చేసుకోవచ్చు.
కేజీహెచ్‌లో క్లాస్ ఫోర్ ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఎంఎన్ఓ..ఎఫ్ఎన్ఓ లతో పాటు స్వీపర్లు…హౌస్ కీపింగ్ ఉద్యోగులు…సెక్యూరిటీ గార్డులు…సెక్యూరిటీ సూపర్‌వైజర్…ఇలా ఒకటి రెండూ కాదు…పదుల సంఖ్యలోనే ఉద్యోగాలు వేస్తానంటూ అందినంతా దోచేసుకున్నారు. ఉన్నతాధికారులను మభ్య పెట్టి కొందరికి…ఔట్ సోర్సింగ్..కాంట్రాక్టు ఏజెన్సీలను భయ పెట్టి…బెదిరించి మరి కొన్ని ఉద్యోగాలను అనుకున్న రేట్లకు అమ్మేసుకున్న ఈ లేడీ బాస్ వెంట ఇంకా బాధితులు తిరుగుతూనే ఉన్నారంటే మరెంత మందిని ఈమె మభ్య పెట్టారో నిఘా వర్గాలే లెక్క తేల్చాలి. శెలవు దొరికితే కాకినాడ…ఏలేశ్వరం ప్రాంతాల్లో తిరిగే ఈమె అసలు గుట్టు కాకినాడ…పోలవరం…ఏఎస్ఆర్…అనకాపల్లి…విశాఖ జిల్లాల్లోని వైద్య ఉద్యోగులందరికీ తెలిసినప్పటికీ పోనీలే మారుతుందని భావించారు. కానీ రోజు రోజుకూ ఆమె అవినీతి కొండ కాస్తా అనకొండలా పెరుగుపోతుండడంతో నిత్యం కార్యాలయానికి బాధితులు క్యూ కడుతున్నారు. కొందరు బాధితులైతే పోలీస్ స్టేషన్లను సైతం ఆశ్రయించడంతో గత వారంలోనే ఓ వ్యక్తికి రూ. లక్ష ఫోన్ పే ద్వారా వెనక్కి వేసినట్టు చెప్పుకుంటున్నారు. ఆమె కింది ఉద్యోగులను వేధిస్తుండడంతో పాటు లంచాల కోసం సూటిపోటి మాటలతో…నలుగురి మధ్య నవ్వులు పాల్జేసే ఆమె తీరును ఉద్యోగలందరూ అసహ్యించుకుంటున్నారు. ఆమె కార్యాలయంలో ఉండకుండా డబ్బులొచ్చే ఫైళ్ల ను పట్టుకుని గుమస్తాల సీట్లకు వచ్చేస్తుండడాన్ని కూడా రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఉన్నత స్థానంలో ఉన్న ఆమె మరీ దిగజారిపోయి నీచ పనులకు బరి తెగించడాన్ని ఛీత్కరించుకుంటున్నారు. ఓ ప్రభుత్వ రంగ సంస్థలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉద్యోగోన్నతి పొంది కూడా కక్కుర్తి వేషాలు వేస్తుంటే ఆమె కన్నా ఉన్నత సీట్లలో ఉన్న అధికారులు ఆమెకు ఏం నేర్పుతున్నారన్నది కూడా ఎవరికీ అంతు చిక్కడం లేదు. వందలాది ఉద్యోగులు పని చేస్తున్న చోట నడుచుకోవాల్సిన విధానమిదేనా అని ప్రశ్నించుకుంటున్నారు. ఏది ఏమైనా ఆమెలో మార్పు అయితే రాదని కుండ బద్దలు కొట్టి మరీ చెబుతున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version