Home Uncategorized కల్తీ స్కాం లో జోగి రమేష్ అరెస్టు

కల్తీ స్కాం లో జోగి రమేష్ అరెస్టు

0

కల్తీ స్కాం లో జోగి రమేష్ అరెస్టు

ఆయన సోదరుడు రాము, అనుచరుడు కూడా అదుపులోకి

కల్తీమద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌తో పాటు.. ఆయన సోదరుడు జోగి రాము, ప్రధాన అనుచరుడు ఆరేపల్లి రామును అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ చేసిన అనంతరం విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి వారిని తరలించారు. అయితే తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఈ సందర్భంగా ఆరోపించారు జోగి రమేష్. మరోవైపు జోగి రమేష్ అరెస్ట్ నేపథ్యంలో ఇబ్రహీంంపట్నంలోని ఆయన ఇంటిదగ్గర హైడ్రామా నెలకొంది. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ నిరసనకు దిగారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. జోగి రమేశ్‌ ప్రోద్బలంతోనే కల్తీ మద్యం తయారు చేసినట్లు ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ఈ ఉదయం జోగి రమేశ్‌ ఇంటికి వెళ్లిన పోలీసులు అరెస్ట్ చేశారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version