అగనంపూడి జయ జయహే: జీవీఎంసీ 85 వార్డ్ పెదమడక ఫిట్నెస్ క్లబ్ స్టూడెంట్ ఇటీవల అనంతపురం జిల్లా లో జరిగిన జూనియర్ రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించి నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీలకి సెలెక్ట్ అయిన కే జీవన్ కుమార్ ని ఫిట్నెస్ క్లబ్ కోచ్ హరికృష్ణ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు ఘనంగా సన్మానించారు. ఏ డి సి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రపంచంలో కులము, మతము, భాష, జాతి భేదం లేకుండా వ్యక్తిగత నైపుణ్యంతో అవార్డులు సాధించుకునేది క్రీడారంగమే అని అన్నారు. శరీర దృఢత్వానికి చదువుల్లో ఉద్యోగాల్లో క్రీడా రిజర్వేషన్ల వల్ల మంచి ఫలితాలు సాధించగలరని అన్నారు.
85 వార్డు టిడిపి ప్రధాన కార్యదర్శి విందుల రాజు మాట్లాడుతూ మన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రారంభమైన ఫిట్నెస్ క్లబ్ సంవత్సర కాలంలోనే శిక్షణ పొందుతున్న స్టూడెంట్స్ మంచి ఫలితాలను సాధించడం అభినందినీమని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కి క్రీడాకారులను ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు.
రాష్ట్ర టిడిపి బీసీ సెల్ ఉపాధ్యక్షులు గుర్రం నూకరాజు సభ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి సభ్యులు డొక్కా రమేష్ స్థానిక టిడిపి నాయకులు గ్రామ పెద్దలు జి నూకరాజు, ఎన్ రాంబాబు, యు జగన్నాథం స్టూడెంట్స్ చరణ్ సాయి, తరుణ్, జిస్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
