పెద్ద ఎత్తున సభ్యులను చేర్పించండి
జనసేన పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించి మాడుగుల నియోజవర్గం ముఖ్య నాయకులతో శనివారం చీడికాడ మండలం అధ్యక్షులు గంట్ల వరహమూర్తి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పెందుర్తి శాసనసభ్యులు విశాఖ జిల్లా జనసేన పార్టీ రూరల్ అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు హాజరై మాట్లాడుతూ జనసేన పార్టీ ఎన్నో ప్రజా పోరాటాలను ఉద్యమాలను చేసి గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఒక బలమైన పార్టీగా ఎదిగిందని ఆ పార్టీలో పని చేయడం మన అదృష్ట మన్నారు.అలాగే బూతు స్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు పార్టీని మరింత పటిష్టం చేయడానికి సభ్యత్వ నమోదు చాలా కీలకమని ఈ ప్రక్రియలో నాయకులందరూ పూర్తిస్థాయిలో పనిచేయాలని కోరారు. గ్రామాల్లో ప్రజలను కలిసి వారిని చేతనందులు చేసి జనసేన పార్టీ సభ్యులుగా చేర్చాలని అన్నారు. అలాగే భవిష్యత్తులో ప్రతి పార్టీ సభ్యునికి పార్టీ అండగా ఉంటుందని రాబోయే రోజుల్లో ఈ సభ్యత్వం నుంచి నాయకులుగా ఎదిగే ప్రక్రియను పార్టీ చేపట్ట పోతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న చోడవరం జనసేన పార్టీ ఇంచార్జ్ మాట్లాడుతూ మన పార్టీకి సభ్యత నమోదు అత్యంత కీలకమని మాడుగుల నియోజకవర్గంలో అధిక సంఖ్యలో సభ్యత నమోదు చేయాలని సూచించారు.ఈ సమావేశంలో దేవరపల్లి,మాడుగుల మండల పార్టీ అధ్యక్షులు, రామ్మూర్తి నాయుడు,శివాజీ నాలుగు మండలాల నాయకులు,కార్యకర్తలు,వివిధ గ్రామ పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.
