Home Politics Andhra Pradesh జగన్ కు హిందువుల పట్ల గౌరవం లేదు

జగన్ కు హిందువుల పట్ల గౌరవం లేదు

0

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

మాజీ సీఎం జగన్‌కు, వైసీపీ నేతలకు హిందూమతం పట్ల, హిందువుల పట్ల ఏమాత్రం గౌరవం లేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాటాడుతూ వైసీపీ అధినేత నీచ బుద్ధితో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. నాడు రాక్షసులు.. దేవాలయాలను, దేవుళ్లను నాశనం చేశారని.. కలియుగంలో జగన్, వైసీపీ నేతలు కూడా అదే తరహాలో ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఆయనకు కలియుగ దైవం పట్ల గౌరవం లేదు కాబట్టే భార్యతో వెళ్లలేదని, శ్రీవారి మాడవీధుల్లోనూ చెప్పులేసుకునే తిరిగారని ఆరోపించారు. ఆఖరికి పరకామణిలో చోరీ జరిగితే చిన్న కేసులా సెటిల్ చేశాడని, హిందూమతంపై గౌరవం లేదని, హిందువులను చులకనగా చూడటం దారుణమన్నారు. ఆయన హయాంలో సుమారు 300 ఆలయాలపై దాడులు జరిగితే ఒక్కసారి కూడా వాటిని ఖండించలేదని, లడ్డూ కల్తీ విషయాన్ని కప్పిపుచ్చడానికి జోళ్లు వేసుకుని అపచారాలు చేస్తున్నారన్నారు. వేంకటేశ్వర స్వామి డబ్బులు పక్కదారి పట్టించేందుకు యత్నించారని, టీటీడీ వీఐపీ, సేవా టికెట్లను వైసీపీ నేతలు అడ్డగోలుగా అమ్ముకున్నారన్నారు. వీటన్నిటికీ బాధ్యత వహిస్తూ.. జగన్ రెడ్డి తప్పు ఒప్పుకోవాలి. శ్రీవారికి, హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి’ అని పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
జనసేన నగర అధ్యక్షులు, ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ మాటాడుతూ అసెంబ్లీ లో వైసీపీ నాయకులు వెంకటేశ్వరుని చిత్ర పటాన్ని పట్టుకుని చేసిన అపచారం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని ఒక యూనిట్ గా చేసుకుని వైసిపి వ్యాపారం చేసిందన్నారు.
లాండ్ సాండ్ మాఫియా చేసుకున్నారని, ఇలాంటి పనులు చేసిన
జగన్మోహన్ రెడ్డి కి క్రికెట్ మ్యాచ్ ఆడుకోవడానికి 11 మంది మిగిలారని, టిటిడి కల్తీ లడ్డు వ్యవహారం లో చేస్తున్న చేష్టలకు దేవ దేవుడు మీద అవాక్కులు మాట్లాడుతున్న వైసీపీ కి
ఈ సారి టెన్నిస్ ఆడుకోవడానికి రెండు సీట్లు ఇచ్చి పక్కన కూర్చో పెడతారన్నారు. టీడీపీ నగర అధ్యక్షులు పట్టాభిరామ్ తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version