దానవాయిపేటలోని మదీన మసీదు అభివృద్ధికి నూతన కమిటీ సమగ్రంగా కృషి చేయాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. మసీదు అభివృద్ధి, ఆస్తుల పరిరక్షణతో పాటు సమాజ సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆయన ఆకాంక్షించారు.
దానవాయిపేట మదీన మసీదుకు నూతనంగా ఏర్పాటైన కమిటీ సభ్యులు అల్ సమీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత, ముస్లిం మైనారిటీ నాయకులు మహమ్మద్ అబ్దుల్లా ఆధ్వర్యంలో తిలక్ రోడ్డులోని ఎమ్మెల్యే కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కమిటీ గౌరవాధ్యక్షులు మహబూబ్ జానీ, ఎస్.డి. అమీరుద్దీన్ షా, అధ్యక్షులు యం.డి. కరీమ్ మహిద్దీన్, ఉపాధ్యక్షులు సయ్యద్ అప్సర్, సెక్రటరీ షేక్ ఇంతియాజ్, జాయింట్ సెక్రటరీ సయ్యద్ ఫయాజ్, ట్రెజరర్ షాజహాన్, సభ్యులు యం.డి. అహ్మద్ మోహిద్దీన్, షేక్ అబ్దుల్ రెహ్మాన్, షాజీద్ జిలానీ, యం.డి. అష్రర్ఫ్ ఆలీ తదితరులు ఎమ్మెల్యేను కలిసి కమిటీలో తమకు బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మసీదు అభివృద్ధి కార్యక్రమాలు పారదర్శకంగా నిర్వహించాలన్నారు. మసీదు ఆస్తులను సంరక్షిస్తూ, భక్తులకు సౌకర్యాలు మెరుగుపరిచే దిశగా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మసీదు కమిటీ సభ్యులు మాట్లాడుతూ మసీదు అభివృద్ధి, సమాజ సేవా కార్యక్రమాల విస్తరణకు కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో షేక్ బషీర్, యం.డి. ఖాన్ బాయ్, సయ్యద్ అప్సరీ, యం.డి. అస్లాం తదితరులు పాల్గొన్నారు.
