Home Uncategorized డి ఎస్ పి గా ఐపి ఎస్ అధికారిణి సుస్మిత నియామకం

డి ఎస్ పి గా ఐపి ఎస్ అధికారిణి సుస్మిత నియామకం

0
  • డి ఎస్ పి గా ఐపి ఎస్ అధికారిణి సుస్మిత నియామకం
  • ఆడి షనల్ ఎస్పి హోదా లోఇన్ సర్వీస్ గా బాధ్యతల నిర్వాహణ
    జంగారెడ్డిగూడెం, జయ జయహే

స్థానిక పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటు అయిన ముపై సంవత్సరాల చరిత్ర లో మొదటి సారి ఐ పి ఎస్ అధికారిని ఇక్కడ పోస్ట్ చేశారు. ఇన్ సర్వీస్ గా అడి షినల్ ఎస్ పి గా ఆమె ఇక్కడ బాధ్యతలు నిర్వహించనున్నారు.
2023 కర్ణాటక కేడర్ ఐ పి ఎస్ అధికారిణి సుస్మిత ను ఇక్కడ పోస్ట్ చేసేరు. రెండు మూడు రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నారని సమాచారం. ఇన్ సర్వీస్ కోసమే అయినా ఐ పి ఎస్ అధికారి మొదట సారి ఈ సబ్ డివిజన్ కు రావటం విశేషం గా చెప్పాలి. ప్రస్తుతం డి ఎస్ పి యు రవిచంద్ర ను బదిలీ చేసి ఆయన స్థానం లో ఐ పి ఎస్ పోస్ట్ చేశారు. సబ్ డివిజన్ ఏర్పాటు అయ్యాక ఎక్కువగా ర్యాంకర్స్ డివై ఎస్పీలుగా వచ్చారు. కేవలం ముగ్గురు మాత్రమే డైరెక్ట్ గా రిక్రూట్ అయినవారు పనిజేశారు.
ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఐపిఎస్ అధికారి ఇక్కడ నియమించడం పట్ల ప్రజలు హార్షం వ్యక్తం చేస్తున్నారు. దీర్ఘ కాలికంగా వున్న సమస్యలు కొలిక్కి వస్తాయని ఆశిస్తూన్నారు. బహుశా ఏడాది కాలం సర్వీస్ నిమిత్తం వస్తున్నా ప్రజలకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు
డివిజన్ పరిధిలోఇటీవల పెరిగిన నేర ప్రవృత్తి, రెండు జాతీయ రహదార్లు కలిగిన ప్రాంతం కాబట్టి అడిషి నల్ ఎస్ పి ని ఇక్కడ నియమించినట్టు భావిస్తున్నారు. ప్రస్తుతం తల్లాడ -దేవరపల్లి జాతీయరహదారి మాత్రమే ఉండగా త్వరలో ఖమ్మం-దేవర పల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే వినియోగం లోకి రానున్నది. అలాగే రెండు జాతీయ రహదారులు నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణ, తక్షణ వైద్యసహాయం నిమిత్తం ఏరియా హాస్పిటల్ లో..ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు కానున్నదని తెలిసింది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version