Saturday, April 18, 2026
HomeUncategorizedముంచంగిపుట్టు లో ముమ్మర వాహన తనిఖీలు

ముంచంగిపుట్టు లో ముమ్మర వాహన తనిఖీలు

  • ముంచంగిపుట్టు లో ముమ్మర వాహన తనిఖీలు
  • వాహన చోదకులు నిబంధనలు పాటించకుంటే కేసులు నమోదు: ఎస్ఐ రామక్రిష్ణ

ముంచంగిపుట్టు, జయ జయహే : వాహన చోదకులు నిబంధనలు పాటించాలని, లేకుంటే కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఎస్ఐnజె.రామక్రిష్ణ అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం రాత్రి ఎస్ఐ ఆధ్వర్యంలో
సీఆర్పీఎఫ్, ఏపీఎస్పీ పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు చేపట్టారు. వాహనాలను, రికార్డులను, ప్రయాణికుల లగేజీలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. రికార్డులు సక్రమంగా లేని వాహనాలపై, ‘డ్రైవింగ్ లేని వాటిపైన, హెల్మెంట్ ధరించని వారి పైన కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ వాహనాలు నడిపే సమయంలో మద్యం సేవించరాదని, ద్విచక్ర వాహన చోదకులు విధిగా హెల్మెట్ పెట్టుకోవాలని సూచించారు. అపరిచిత వ్యక్తులకు ఎవరూ ఆశ్రయం కల్పించరాదని అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments