Home News అనంతగిరి బాలికల పాఠశాల-2లో భారత రాజ్యాంగ దినోత్సవం

అనంతగిరి బాలికల పాఠశాల-2లో భారత రాజ్యాంగ దినోత్సవం

0
  • అనంతగిరి బాలికల పాఠశాల-2లో భారత రాజ్యాంగ దినోత్సవం
  • ప్రపంచంలోనే అతి పెద్దది భారత రాజ్యాంగం  -హెచ్,ఏం,బి.మంగమ్మ,

అనంతగిరి: జయ జయహే.

మండలంలోని గల ప్రభుత్వ గిరిజన బాలికల ప్రాథమికొన్నత పాఠశాల-2లో పాఠశాల ప్రధానో పాధ్యాయురాలు బి. మంగమ్మ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా హెచ్ఏం, మంగమ్మ,ఉపాధ్యాయులు, తదితరులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం హెచ్ఏం, బి.మంగమ్మ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగంగా, అన్ని వర్గాల హక్కులు, శ్రేయస్సును ప్రతిబింబించే పత్రంగా నిలిచిందని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించడం, దాని విలువలను ఆచరణలో పెట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. అనంతరం విద్యార్థులకు సాంసృతిక కార్యక్రమాలు, భారత రాజ్యాంగంపై వ్యాసరచన పోటీలు ఏర్పాటు చేసి గెలిపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో వార్డెన్,కె.గంగభవాని, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version