Home Uncategorized విశాఖ వేదికగా ఐఎఫ్ఆర్

విశాఖ వేదికగా ఐఎఫ్ఆర్

0

*విశాఖ వేదికగా ఐఎఫ్ఆర్*. *(డా. ఎం. ఆర్. ఎన్. వర్మ)* ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్) వేడుకకు విశాఖ వేదిక అయింది. సాహస విన్యాసాలకు, స్నేహపూర్వక దేశాల మధ్య పరస్పర సహకారానికి ప్రతీకగా నిలిచే ఈ ఉత్సవాలకు విశాఖ సాగర తీరం ముస్తాబైంది. నేవీ ప్రతినిధులు, నౌకలు, సబ్ మేరియన్లు, ఎయిర్ క్రాఫ్ట్ లు ఒక్కచోట చేరి నిర్వహించే సమీక్షను ఐఎఫ్ఆర్ అంటారు. స్వతంత్ర భారతదేశంలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ ఒక పెద్ద ఈవెంట్. మనదేశంలో మొదటి ఐఎఫ్ఆర్ 2001లో ముంబైలో నిర్వహించారు. రెండవది 2016లో విశాఖలో జరిగింది. 2026లో మూడవ ఐఎఫ్ఆర్ ను కూడా విశాఖపట్నంలో నిర్వహిస్తూ మన దేశం ఆతిథ్యమిస్తోంది. ఈనెల 15 నుండి 26 వరకు భారత్ దేశంలో అతి పెద్ద ఇఫర్ మరియు మిలన్ సంయుక్త సమీక్ష, విన్యాసాలు జరగనుంది. 18న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యుద్ధనౌకల సమీక్ష చేయనున్నారు. మంగళవారం మీడియాతో ముందస్తు సమీక్షా నిర్వహించడం జరిగింది.నౌకల పెరేడ్ ను పరిశీలిస్తారు.71 నౌకలు ఆరు వరసల్లో బారులు తీరుతాయి. ఇందులో 19 విదేశీ నౌకలు, 45 భారత నౌకా దళం, కోస్ట్ గార్డ్, మర్చంట్ నేవీ, పరిశోధన నౌకలు ఉంటాయి. 65 దేశాల నుండి నౌక దళాలు పాల్గొంటున్నాయి. 2026 లో ఏకంగా మిలాన్ తో పాటు అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష (ఐఎఫ్ఆర్), భారత సముద్ర నౌకాదళ చర్చా గోష్టి కూడా జరుగుతోంది. ఇందులో 65 దేశాలు పాల్గొనడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. *నావికా బలాన్ని చాటేలా మిలాన్*. దేశ నావికా బలాన్ని చాటేలా మిత్ర దేశాలతో బంధం పెంచేలా మిలాన్ నిలుస్తోంది. ఈసారి భారతదేశం మిలాన్-2026 కు అధ్యక్షత వహిస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖ బీచ్ రోడ్ లో సిటీ పెరేడ్ జరగనుంది. తొలిసారిగా 1995లో అండమాన్ నికోబార్ రాజధాని పోర్టు బ్లెయిర్ లో కేవలం నాలుగు దేశాలతో ” . నాడు ‘లుక్ ఈస్ట్ పాలసీ’ ప్రారంభమైంది. ఇండోనేషియా, సింగపూర్, శ్రీలంక, థాయిలాండ్ దేశాలు భారత ఆధ్వర్యంలో సంయుక్త విన్యాసాలు చేపట్టాయి. తర్వాత 2022లో విశాఖ తీరాన జరిగిన’మిలాన్’ లో మొత్తం 39 దేశాలు పాల్గొన్నాయి. 2024లో అతిపెద్ద ఎడిషన్ గా 51 దేశాలతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ విన్యాసాల్లో భారత్ ప్రతిష్టాత్మకమైన యుద్ధ విమాన వాహక నౌకలైన ఐఎన్ఎస్ విక్రాంత్, ఐ ఎన్ ఎస్ విక్రమాదిత్యలు పాల్గొనడం విశేషం. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితర ప్రముఖులు పాల్గొనున్నారు. అలాగే భారత నావికాదళం నిర్వహణలో జరిగే ఈ ఈవెంట్ కు ప్రపంచ నలుమూలల నుంచి నావికులు హాజరవుతున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version