Home Politics Andhra Pradesh నిరూపిస్తే రాజకీయాలకు ఆదే అఖరి రోజు

నిరూపిస్తే రాజకీయాలకు ఆదే అఖరి రోజు

0

దావోస్ లో చలి అని నేను అనలేదు,నాపై ఆరోపణలు అవాస్తవం,దమ్ముంటే లోకేశ్ నిరూపించాలి,చంద్రబాబు పొలిటికల్ మార్కెటింగ్,మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ వ్యాఖ్యలు,బాధ్యతగల పదవుల్లో ఉంటూ ప్రపంచ వేదికలపై రాష్ట్రంలో పెట్టుబడులు గురించి మాట్లాడకుండా వ్యక్తిగత విమర్శలు చేయడంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, దావోస్ లో పెట్టుబడులు గురించి కాకుండా చంద్రబాబు పొలిటికల్ మార్కెటింగ్ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. అధికార పార్టీ తీరు బ్రాండ్ ఇమేజ్ తో కాకుండా దావోస్ కి బ్యాండ్ మేళంతో పర్యటనకు వెళ్లినట్లుందని మండిపడ్డారు. వైయస్.జగన్ హయాంలో ఒప్పందం చేసుకున్న పరిశ్రమలకు శంకుస్థాపన చేస్తూ.. వాటిని తమ ఖాతాలోకి వేసుకోవడం ద్వారా… ముమ్మూటికీ తండ్రీ, కొడుకులు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని అమర్ తేల్చి చెప్పారు. అన్నీ తానే అనడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అని, తాను కట్టకపోయినా శంషాబాద్ విమానాశ్రయం, అవుటర్ రింగ్ రోడ్డు, భోగాపురం విమానాశ్రయాలను చంద్రబాబు తన ఖాతాలోకి వేసుకోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. 18 నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన పరిశ్రమలేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవైపు రాష్ట్రంలో సంక్రాంతి పండగలో అధికార పార్టీ నేతలో అశ్లీల నృత్యాలు నిర్వాహకులగా మారితే… దానిపై స్పందించకపోవడం దారుణమన్నారు. చలి కారణంగా దావోస్ పర్యటనకు వెళ్లలేదంటూ తనపై మంత్రి లోకేష్ చేసిన ఆరోపణలు మీద అమర్నాధ్ తీవ్రంగా స్పందించారు. లోకేష్ చేసిన వ్యాఖ్యలను నిరూపించాలని లేని పక్షంలో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.టీడీపీది బ్యాండ్ మేళం,ప్రముఖ స్ధానాల్లో ఉన్న వ్యక్తులు ప్రపంచ వేదికల మీదకి వెళ్లినప్పుడు సహజంగా రాష్ట్రం గురించి, ఇక్కడున్న వనరులు, అవకాశాలతో పాటు పెట్టుబడులు పెట్టడానికున్న అనుకూలతలు గురించి చెప్పుకోవడం సహజం. కానీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు మంత్రి లోకేష్ బృందం పూర్తిగా వారి సొంత డబ్బా చెప్పుకున్నారు. దావోస్ వేదికగా ముఖ్యమంత్రి, ఆయన సహచరులు మాట్లాడుతూ… ఈ వేదికకు వచ్చినప్పుడు చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ తో ఈ సమావేశంలో పాల్గొంటున్నామని చెప్పారు. కానీ ప్రజలకు మాత్రం వాళ్లు బ్రాండ్ ఇమేజ్ తో కాకుండా తెలుగుదేశం పార్టీ బ్యాండ్ మేళంతో వెళ్లినట్లు కనిపించింది. జ్యూరిక్ వేదికగా తెలుగు డయోస్పోరాతో జరిగిన సమావేశంలో తండ్రికి కొడుకు, కొడుక్కి తండ్రి డప్పు కొట్టుకోవడమే ఇందుకు కారణం అని అమర్ నాథ్ ఆరోపించారు. స్దానిక యూరప్ కి చెందిన పెట్టుబడిదారులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ లోకేష్ తన తండ్రి చంద్రబాబు ఒక యూనిక్ పీస్ అని వాస్తవం చెప్పాడు. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడవడంలోనూ, నాలుగు సార్లు గెలిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలను వెన్నుపోటు పొడవడంలోనూ, 16 సంవత్సరాలు పాటు సీఎంగా చేసి ఈ రాష్ట్రానికి ఏమీ చేయకుండా ఉంటూ కేవలం పొలిటికల్ మార్కెటింగ్ అండ్ మేనేజిమెంట్ లో నీ తండ్రికి మించిన వ్యక్తి ఈ ప్రపంచలో మరెక్కడా ఉండడు కాబట్టి.. ఆయన కచ్చితంగా యునిక్ పీస్ అన్న విషయాన్ని లోకేష్ సరిగ్గానే చెప్పాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైయస్.జగన్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన కార్యక్రమాలు, ఆయన శంకుస్థాపన చేసిన కార్యక్రమాలు, ప్రారంభించిన పనులను నేనే కారణం అని చెప్పుకుంటూ… చంద్రబాబు, తనయుడు లోకేష్ వారి ప్రభుత్వం క్రెడిట్ చోరీకి పాల్పడుతోంది. ఇళ్ల నిర్మాణం చేస్తున్నప్పుడు దిష్టి తగలకుండా బొమ్మలు పెడతాం. ఇళ్లు నిర్మాణం పూర్తైన తర్వాత ఈ నిర్మాణానికి నేనే కారణం అని దిష్టిబొమ్మ అనుకున్నట్టు.. నారావారి దిష్టబొమ్మ కూడా రాష్ట్రంలో ఏం జరిగినా నా వల్లే అనుకోవటం పరిపాటిగా మారింది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, అవుటర్ రింగ్ రోడ్డు, భోగాపురం అంతర్జాతీయ ఎయిర్ పోర్టు ,విశాఖ హెల్క్ సిటీ, రుషికొండ ఐటీ టవర్స్ ఇవన్నీ ఆయన చేయకపోయినా నేనే చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబులాంటి వ్యక్తిని చూసి జాలిపడాలో, సిగ్గుపడాలో, బాధపడాలో తెలియని పరిస్ధితి నెలకొందని వ్యాఖ్యానించారు.నిరూపిస్తే రాజకీయాలకు అదే ఆఖరి రోజు,నా మీద కూడా వ్యక్తిగతంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. గతంలో ఐటీతో పాటు ఐదుశాఖల మంత్రిగా నేను పనిచేశాను. మా ప్రభుత్వ హయాంలో 2022 మే నెలలో వైయస్.జగన్ అధ్యక్షతన దావోస్ పర్యటనకు వెళ్లాం. మరలా 2023 జనవరిలో దావోస్ కి ఆహ్వానం వస్తే ఆరు నెలలు ముందే వెళ్లాం.. ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడం కరెక్టు కాదు. వచ్చే ఏడాది చూద్దామని సీఎం వైయస్.జగన్ చెబితే దానిపైనా తప్పుడు ప్రచారం చేశారు. అసలు మాకు ఆహ్వానమే రాలేదని లోకేష్ తో పాటు ఆయన బృందం తప్పుడు ప్రచారం చేసింది. చంద్రబాబు మార్కెటింగ్ పిచ్చి గురించి మాట్లాడితే.. మేం దావోస్ లో చలి ఉంటుంది కాబట్టి వెళ్లలేదన్నట్టు.. ప్రచారం చేశారు. ఇదే లోకేష్ జ్యూరిక్ ప్రపంచ వేదిక సాక్షిగా నా మీద చేసిన ఆరోపణలు నిరూపించే శక్తి ఉంటే, నేను మాట్లాడినట్లు విజువల్స్ చూపిస్తే.. రాజకీయాల్లో అదే ఆఖరి రోజు అవుతుంది. నిరూపించలేకపోతే క్షమాపణ చెప్తావా? ముఖ్యమంత్రిగా కొడుకుగా ఫేక్ వార్తలను ప్రచారం చేసి, రాజకీయంగా లబ్ది పొందే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా గుడివాడ అమర్నాద్ ఖండించారు. ఇప్పటికైనా రాష్ట్ర అవరాలు, ప్రయోజనాలు, ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు. అంతే కాకుండా కూటమి ప్రభుత్వం తమకు చేస్తున్న అక్రమాలు, అన్యాయాలను ప్రజలు తెలుసుకున్నారని… రానున్న కాలంలో వీటన్నింటికీ కూడా తగిన బుద్ధి చెప్పడం ఖాయమని తేల్చి ఆయన చెప్పారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version