Home Politics Andhra Pradesh హోంమంత్రి అనితకు స్వల్ప అస్వస్థత

హోంమంత్రి అనితకు స్వల్ప అస్వస్థత

0

ఆందోళన వద్దు.. బాగానే ఉన్నాన్న మంత్రి

రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అస్వస్థతకు గురయ్యారు. గురువారం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఆమె కొంత అస్వస్థతకు గురయ్యారు. దీంతో అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న వైద్యులు.. అనితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు బీపీ అధికంగా ఉందని గుర్తించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం విజయవాడలోని ఆసుపత్రికి మంత్రి అనిత వెళ్లారు. తన అనారోగ్యంపై వస్తున్న వార్తలపై హోం మంత్రి అనిత స్పందించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని స్పష్టం చేశారు. తన ఆరోగ్యంపై ఎవరు ఆందోళన చెందవద్దన్నారు. కొద్దిపాటి అలసట కారణంగా చిన్న ఇబ్బంది కలిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని హోం మంత్రి వంగలపూడి అనిత వివరణ ఇచ్చారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version