మండలం లోని పినకోట పంచాయతీ రాచకిలం గ్రామంలో హర్ ఘర్ జల ఉత్సవ్ గ్రామసభ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం సర్పంచ్ ఎస్ గణేష్ ఆధ్వర్యంలో ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ గౌతమ్ కాంట్రాక్టర్ జి సతీష్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ద్వారా గ్రామ ప్రజలు ఆరోగ్యం జీవన ప్రమాణాలు మెరుగుపడతాయిఅని, ప్రతి కుటుంబానికి నలుగురు ఆరోగ్యాన్ని కాపాడే సురక్షితమైన నీరు అందించడం ఈ పథకం ముఖ్య లక్ష్యం అన్నారు. హర్గర్ చల్ ఉత్సవ గ్రామ అభివృద్ధికి ప్రజలు రోగాల బారి నుండి మెరుగుపడవచ్చని సురక్షితమైన నీటి సౌకర్యాన్ని పొందుతూ సంతోషంగా ఉండచ్చని రోగులను బారిన పడకుండా మరింత ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో వి బి జి రాంజీ ( ఎన్ఆర్ఈజీఎస్) టి ఏ ఎస్ గంగు నాయుడు వైసిపి మాజీ కన్వీనర్ ఎస్ శ్రీనివాసరావు, వైసిపి పంచాయతీ అబ్జర్వర్. డి లోకేష్, మాజీ వాలంటీర్ ఎస్ జోగిరాజ్, ఎస్ నాగరాజు, వైసీపీ కార్యకర్త కే నివాష్ పాల్గొన్నారు.
