మూలపేట పోర్ట్ కై వైసిపి పోరాటం ఆగదు
ఈనెల 30న పోర్టు వద్ద వైఎస్ఆర్సిపి భారీ సందర్శన
టెక్కలి వైఎస్ఆర్సిపి పేరాడ తిలక్ పిలుపు
శ్రీకాకుళం జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం సంతబొమ్మాలి మండలం లోని మూలపేట గ్రీన్ పోర్ట్ త్వరితగతిన నిర్మాణం పూర్తి చేయాలని ప్రస్తుత కూటమి ప్రభుత్వం అల సత్వం వహించడం తగదని టెక్కలి వైఎస్ఆర్సిపి సమన్వయకర్త పేరాడ తిలక్ అన్నారు.
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జిల్లా అభివృద్ధి , ప్రత్యామ్నాయ ఉపాధులు కల్పించడం కోసం జిల్లా ప్రగతి సాధించేందుకు యుద్ధ ప్రాతపదికన పోర్టు , రహదారులు నిర్మాణం కొనసాగిందని అన్నారు.
నేటి కూటమి ప్రభుత్వం అధినేతలతో పాటు కింజరాపు అచ్చం నాయుడు, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు లు,రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అదనపు భూములు సహకరించి పారిశ్రామిక పెట్టుబడి దారుల వ్యాపారాలకు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ కోసం ఈ నెల 30న కోర్టు వద్ద జరగనున్న న్యాయ పోరాటానికి ప్రజలంతా మద్దతు పలకాలని ఆయన పిలుపునిచ్చారు,జిల్లా ప్రజల శ్రేయస్సు అభివృద్ధి కోసం వైఎస్ఆర్సిపి అలుపెరుగని పోరాటాలకు సిద్ధమవుతుందని ఇందుకు క్షేత్రస్థాయిలో కార్యకర్తలు న్యాయం కోసం పోరాటం చేయాలని స్పష్టం చేశారు, ఈ కార్యక్రమంలో టెక్కలి నియోజకవర్గం వైఎస్ఆర్సిపి పరిశీలకలు చల్లా రవికుమార్, మండల, జడ్పిటిసి, పంచాయితీ, గ్రామస్థాయి, సర్పంచులు, ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు పాల్గొని మూలపేట పోర్ట్ పూర్తి స్తాయి నిర్మాణానికి మద్దతు పలికారు.
