రాజమండ్రి గోకవరం బస్టాండ్ నుండి గోకవరం డిపోకు వస్తున్న సింగల్ స్టాప్ బస్సులో బుధవారం సాయంత్రం సమయంలో చోరీ జరిగింది. బాధితురాలు వెంటనే తన బంగారు గొలుసు కనబడటం లేదని కేకలు వేయడంతో అప్రమత్తమైన బస్సు డ్రైవర్ నేరుగా గోకవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు.గోకవరం ఎస్సై పవన్ కుమార్ తన సిబ్బందితో ప్రయాణికులను వారి లగేజీ బ్యాగ్ లోను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం ప్రయాణికుల సౌకర్యార్థం పోలీస్ స్టేషన్ నుండి బస్సును ఆర్టీసీ కాంప్లెక్స్ కు తరలించి,అక్కడ బస్సు దిగిన ప్రయాణికులను సైతం తనిఖీ చేశారు. ప్రయాణికులు పూర్తిగా దిగిపోయిన తర్వాత ఖాళీ బస్సులో కూడా తనిఖీ చేయడం జరిగింది.ఎంత వెతికినా బంగారు గొలుసు దొరకలేదు. దీంతో బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
