Friday, May 1, 2026
HomePoliticsAndhra Pradesh5 కిలోల సిలిండర్లకు ఫుల్ డిమాండ్

5 కిలోల సిలిండర్లకు ఫుల్ డిమాండ్

రెండు వారాల్లో 6.6 లక్షల సిలిండర్ల సేల్స్

కేంద్ర ప్రభుత్వ గణంకాలు వెల్లడి

పశ్చిమాసియాలో రగులుతున్న వేడి వల్ల వంటిళ్లలో మంటలు చెలరేగుతున్నాయి. హర్మూజ్​ జలసంధి మూసివేయడంతో ఎల్​పీజీ గ్యాస్​ సరఫరాకు అంతర్జాతీయంగా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో ప్రజలు సిలిండర్ కోసం ఏజెన్సీల వద్ద భారులు తీరుతున్నారు. అయితే, ఎల్​పీజీ సమస్య తలెత్తినప్పటి నుంచి 14.2 కేజీ సిలిడంర్​ కంటే 5 కిలోల సిలిండర్​కు ఆదరణ పెరిగిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మార్చి 23 నుంచి ఇప్పటివరకు దాదాపు 6.6 లక్షల సిలిండర్లు అమ్ముడైనట్లు గణాంకాలు వెల్లడించాయి. అయితే, చెల్లుబాటయ్యే గుర్తింపు పత్రాలు చూపించడం ద్వారా సమీపంలోని ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్ల నుంచి వీటిని తీసుకోవచ్చని పేర్కొంది. మరోవైపు, గ్యాస్​ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో కొన్నిచోట్ల అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ పెరిగింది. దీంతో అధికారులు రంగంలోకి దిగి, అలాంటి వారిపై ఉక్కుపాదం మోపుతున్నారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మార్చి నుంచి 50 వేలకు పైగా దాచి ఉంచిన సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments