Home News వర్ర తోక వలసలో మంచినీటి కొరత

వర్ర తోక వలసలో మంచినీటి కొరత

0

అల్లూరి జిల్లా అరకువేలి మండలం సిరిగం పంచాయతీ వర్ర తోకవలస గ్రామంలో త్రాగునీటి సమస్యపై గిరిజనులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ సందర్భంగా ఆదివాసి గిరిజన సంఘం నాయకులు ఎస్ ఐసు బాబు వర్ర తోకవలస గ్రామంలో పర్యటించారు. గత 20 సంవత్సరాల నుండి గడ్డ నీళ్లు త్రాగుతుండడంతో అనేక జలుబు జ్వరాలు వచ్చి రోగుల పాయలు అవుతున్నారని తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రభుత్వం వర్ర తోక వలస గ్రామంలో మంచి నీటి కొరత సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు. ఏడాది గ్రామం ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ‌

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version