అరకు వేలి మండల కేంద్రంలోని ఎండపల్లివలస లో రైల్వే ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ రైల్వే ఉద్యోగులు స్థానిక ప్రజల కోసం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం నిర్వహించబడింది. విశాఖ మెడికో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ (విశాఖపట్నం) నుంచి ఆంకాలజిస్ట్ డా. వెంకట సాంబశివరావు బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.క్యాన్సర్ అవగాహన స్క్రీనింగ్ పరీక్షలు శిబిరంలో క్యాన్సర్ సంబంధిత అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. పాన్ పరాగ్, గుట్కా, పొగాకు వంటి చెడు అలవాట్ల వల్ల క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు హెచ్చరించారు. స్క్రీనింగ్ టెస్టులతో పాటు క్యాన్సర్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరణాత్మక సమాచారం అందించారు.క్యాన్సర్ గురించి ముఖ్య విషయాలు దేశంలో సుమారు 30% క్యాన్సర్ కేసులు చెడు అలవాట్ల వల్ల వస్తున్నాయి.ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.ప్రాథమిక దశలో గుర్తిస్తే క్యాన్సర్ పూర్తిగా నయం చేసే అవకాశం ఉంది.మహిళల్లో గర్భాశయ (సర్వికల్) రొమ్ము క్యాన్సర్లు అధికంగా ఉన్నాయి.పురుషుల్లో నోటి, లివర్ క్యాన్సర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి.9–45 ఏళ్ల మహిళలకు గర్భాశయ క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది.చికిత్స సహాయం అవసరమైతే రోగులను విశాఖపట్నం ఆసుపత్రికి రిఫర్ చేసి తదుపరి పరీక్షలు, చికిత్సలు ఉచితంగా అందిస్తామని డాక్టర్లు హామీ ఇచ్చారు. నిర్ధారణ, చికిత్స తరువాతి అబ్జర్వేషన్ కూడా ఉచితంగా అందుబాటులో ఉన్నాయి.నాలుగో దశ క్యాన్సర్ కేసుల్లో కూడా 30% వరకు నయం అయ్యే అవకాశం ఉంది. చెడు అలవాట్లు మానుకుంటే క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.క్యాన్సర్ రాకుండా చేసే ప్రత్యేక మందు ఇప్పటివరకు లేదు, అయితే పూర్తి నయం కోసం పరిశోధనలు కొనసాగుతున్నాయి.ఈ శిబిరం ద్వారా స్థానికులు, రైల్వే ఉద్యోగులు ఆరోగ్య అవగాహన పెంచుకునే అవకాశం పొందారు. ముందస్తు స్క్రీనింగ్ ద్వారా జీవితాలను కాపాడుకోవచ్చని డాక్టర్లు సూచించారు. ఈ కార్యక్రమంలో రైల్వే సిబ్బంది, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
