గవరపాలెం చిన్న హై స్కూల్ విద్యార్థులకు ప్రథమ చికిత్స సి పి ఆర్ ఏ ఏ విధంగా చేయాలో అవగాహన కార్యక్రమం రోటరీ క్లబ్ ఎన్టీఆర్ వైద్యాలయం మానస హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షులు బుద్ధ శ్రీనివాసరావు విద్యార్థులును ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి నెల సేవా కార్యక్రమంలో భాగంగా గవరపాలెంలో హై స్కూల్లో ఈ అవగాహన సదస్సు పెట్టడం జరిగిందని విద్యార్థులు కు హార్ట్ (గుండె) ఎలా పనిచేస్తుంది అది ఆగిపోతే వెంటనే మనం వైద్యం ముందు ప్రధమంగా ఊపిరి మనిషికి ఎలా అందించాలి వారికి అన్న దానిపై వారికి అవగాహన సి పి ఆర్ ఏ ఈ శిబిరంలో పాల్గొన్న వైద్యులు విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైద్యులు పృద్వి, దివాకర్ విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడుతూ హార్ట్ ఎటాక్ వచ్చిన వారిని తక్షణమే సిపిఆర్ చేయడం వల్ల ప్రాణాలు కాపాడవచ్చునని, ఈ విధంగా చేయడం వల్ల గుండె మళ్ళీ కొట్టుకుని ఊపిరితిత్తులు పనిచేసే బ్రెయిన్ కు రక్తం సరఫరా జరుగుతుందని వారు తెలియజేశారు దీనివల్ల గుండె సాధారణ స్థితికి వస్తుందని అప్పుడు మెరుగైన వైద్యం కి తక్షణం దగ్గరలో గల హాస్పిటల్ కి తరలించవచ్చని వారు పేర్కొన్నారు దీనివల్ల ఒకరు ప్రాణం కాపాడిన వాళ్ళము అవుతామని ఒకరి జీవితాన్ని నిలబెట్టిన వారు కూడా అవుతామని వారు పేర్కొన్నారు. ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల రక్తప్రసరణ సాఫీగా జరుగుతుందని అలాగే మనిషి స్పృహ ఉందా లేదా ఒక్కసారి కొట్టి తనిఖీ చేసి ఊపిరితిత్తుల్లోకి రెండుసార్లు నోటి ద్వారా గాలి పంపి పేషెంట్ ముక్కు మూసి నోటితో గాలిని పంపించాలన్నారు అలా చేయడంవల్ల మనిషి లోపలికి గాలి పంపి గుండెలపై కొద్దిగా ప్రెషర్ ఇచ్చి చేస్తే ఊపిరి అందుతుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం సిహెచ్ మహాలక్ష్మి క్లబ్ సభ్యులు బుద్ధ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు
