Home Politics Andhra Pradesh విబి..జి రామ్ జి పై అవగాహన కార్యక్రమాలు

విబి..జి రామ్ జి పై అవగాహన కార్యక్రమాలు

0

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును వికసిత్ భరత్ రోజ్ గార్ ఆది వాక కమిషన్(గ్రామీణ) విబి జి రాంజీ 2025 గా చట్టం రూపొందించిన నేపథ్యంలో ఈ నూతన చట్టంపై ప్రజలకు శ్రామికులకు అవగాహన కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వినోదం చట్టం ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తున్న నేపథ్యంలో ఈ నెల 27 నుంచి మార్చి 30వ తేదీలోగా ఆరు వారాలపాటు వివిధ అంశాలపై గ్రామ గ్రామాన ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు ఎండిఓ కే అప్పారావు శుక్రవారం తెలిపారు. ఉపాధి కార్మికుల హక్కులు చెల్లింపులు వ్యవస్థ, పంచాయతీ ఆధారిత అమలు యంత్రాంగం తదితర అంశాలు లక్ష్యంగా ఈ చట్టం ఆవిర్భవించిందని చెప్పారు. ప్రతి శ్రామికునికి 125 రోజులు విధిగా పని కల్పించాలని, వంద రోజులు పని పూర్తి చేసిన వారిని సత్కరించాలని ఆదేశించినట్లు తెలిపారు. కాబట్టి ఆరు వారాలపాటు జరిగే ఈ కార్యక్రమాల్లో చట్టంలో పేర్కొన్న అంశాలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version