Home News అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల ఆర్థిక దోపిడి

అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల ఆర్థిక దోపిడి

0
  • అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల ఆర్థిక దోపిడి
  • ⁠విద్యార్థులకు అండగా ఉంటా చమర్తి జగన్ మోహన్ రాజు భరోసా

రాజంపేట జయ జయహే
ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధం లేకుండా విద్యార్థులంతా కళాశాల యాజమాన్యానికి ఫీజులు ముందుగానే కట్టడం జరిగిందని,.కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫీజు రియంబర్స్మెంట్ కళాశాల యాజమాన్యంకే చెల్లించడమైనదని టీడీపీ ఇంచార్జి చమర్తి జగన్ మోహన్ రాజు తెలియజేసారు. రాజంపేట పట్టణంలోని తన క్యాంపు కార్యాలయం నందు టిఎన్ఎస్ఎఫ్ – ఎస్ఎఫ్ఐ – పిడిఎస్యూ విద్యార్థి సంఘం నాయకులతో కలిసి ఏఐటిఎస్ విద్యార్థులు నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజుకి వినతిపత్రం అందజేశారు.అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల 2021-2025 బ్యాచ్ కు చెందిన [క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్] పేరుతో ఒక్కొక్క విద్యార్థి దగ్గర ₹ 15,000 లను కళాశాల యాజమాన్యం తీసుకున్నదని విద్యార్థులు నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు దగ్గర ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ విద్యార్థులకు అండగా ఉంటానని,మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా కల్పించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version