Home Politics Andhra Pradesh జెడ్ పిహెచ్ఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో ఫేర్వెల్ డే వేడుకలు

జెడ్ పిహెచ్ఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో ఫేర్వెల్ డే వేడుకలు

0

పట్నంలోని తులసి నగర్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల యాన్యువల్ డే, వీడ్కోలు వేడుక (ఫేర్వెల్ డే) మంగళవారం అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. సుశీల అధ్యక్షత వహించి, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ​ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా, సమాజంలో ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. పదవ తరగతి అనేది విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన మలుపు అని, రాబోయే పబ్లిక్ పరీక్షల్లో ప్రతి ఒక్కరూ ప్రణాళికాబద్ధంగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. ఈ సందర్బంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, పాటలు అలరించాయి. ఈ కార్యక్రమంలో తరగతి ఉపాధ్యాయులు, కుసుమ కుమారి, పద్మావతి, కనకేశ్వరి విద్యార్థినీ విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version