Home Politics Andhra Pradesh అన్నదాన కార్యక్రమాలకు విశేష స్పందన

అన్నదాన కార్యక్రమాలకు విశేష స్పందన

0

అన్న ప్రసాదాన్ని స్వీకరించిన వేలాది మంది భక్తులు

మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మాడుగుల మండలంలో వివిధ శివాలయాలు వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది. మాడుగులలో గల పోతురాజు బాబు ఆలయం వద్ద జరిగిన కార్యక్రమంలో వేలాది మంది భక్తులు హాజరై స్వామి వారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే శివగంగ ఆలయం భీమలింగేశ్వర స్వామి ఆలయాలు వద్ద కూడా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఎం కోడూరు శివాలయం, వీరవల్లి జంక్షన్ లో గల శివాలయం వద్ద కూడా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ఇవే కాకుండా పలు ఆలయాల వద్ద కూడా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version