స్థానిక గౌరపాలెంలో నేడు శనివారం జరగనున్న గౌరీ పరమేశ్వర మహోత్సవానికి పట్టణంలో మెయిన్ రోడ్డు గుండా మరియు గవరపాలెం ప్రతి వీధిలోని దేదీప మానంగా విద్యుత్తు లైట్లతో అలంకరించడం జరిగింది ప్రతి వీధిలోనే స్టేజీలు ప్రోగ్రాములు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ గౌరీ పరమేశ్వరి మహోత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు గొడవలు జరగకుండా అనకాపల్లి పట్టణ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దేవాలయం ప్రాంగణం వద్ద భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని కమిటీ సభ్యులు తెలియజేయడం జరిగింది ఈ ఉత్సవాలకు ఉత్తరాంధ్ర జిల్లా కాకుండా చుట్టుపక్కల గోదావరి జిల్లా నుంచి ఇటు ఏజెన్సీ ప్రాంతం నుంచి కూడా ఈ ఉత్సవాలకు రావడం జరుగుతుందని, ఈ ఉత్సవాల్లో పులి వేషాలు, నేలవేషాలు, మ్యూజికల్ నైట్ ప్రోగ్రాములు, డప్పు వాయిద్యాలు, అమ్మవారి వివిధ రూపాలు అలంకారాల వేషాలు,
చిన్నపిల్లల కూచిపూడి, భరతనాట్యం ప్రోగ్రాములు అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు జరగనున్నాయి అనకాపల్లి ప్రతి ఇంటిలోని చుట్టాలు, బంధువులతో, స్నేహితులతో కలిసి ఆనందించే ఈ సంబరం విందు భోజనాలతో కోలాహాలంగా సందడి నెలకొని ఉంటాయని కమిటీ సభ్యులు పేర్కొన్నారు
