Home Politics Andhra Pradesh గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి

0

జెడ్పిటిసి రాంబాబు

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు జడ్పిటిసి గ్రాంట్ నిధులను వెచ్చిస్తున్నామని జెడ్పిటిసి దొండా రాంబాబు తెలిపారు.రూ.7 లక్షల జిల్లా పరిషత్ నిధులతో అయితంపూడిలో అంగనవాడి భవనం ఆధునికరణ చేపట్టారు. బుధవారం దీనిని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మండలంలోని అన్ని గ్రామాల్లోనూ ఇప్పటికే త్రాగునీటి బోర్లు ఏర్పాటు చేశామన్నారు. పలు గ్రామాల్లో అంగన్వాడీ భవనాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు.భవిష్యత్తులో ఐతంపూడి గ్రామాన్ని జడ్పీ నిధులతో మరింత అభివృద్ధి చేస్తామన్నారు.స్థానిక ఎస్సీ కాలనీలో వినాయకుడి గుడి నిర్మాణ పనులను పరిశీలించారు.ఓ దివ్యాంగురాలికి సదరం సర్టిఫికెట్ పంపిణీ చేశారు.స్థానిక సర్పంచ్ పెద్దాడ నాయుడు, వైస్ ఎంపీపీ గొంపా చినబాబు, సర్పంచులు గోపిశెట్టి శ్రీను,ఆది సత్యనారాయణ,స్థానిక వైసీపీ నేతలు ముచ్చకర్ల రాజు నాయుడు, ముచ్చకర్ల పోతురాజు, ముచ్చకర్ల వెంకట్రావు, అయితిరెడ్డి రమణ, అయితిరెడ్డి శ్రీను, పిళ్లా అప్పలనాయుడు, పోతల రాజబాబు, అయితిరెడ్డి శంకర్రావు, సుంకర రవి, ముచ్చకర్ల మహేష్, పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version