తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో పెండింగ్‌లో ఉన్న గ్రేవ్, నాన్‌గ్రేవ్ కేసులు, ప్రాపర్టీ నేరాలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ వర్క్, పెండింగ్ ఎన్‌బీడబ్ల్యూస్, ఎన్‌డీపీఎస్ కేసుల దర్యాప్తు, రికవరీలపై సర్కిల్ వారీగా పోలీసు అధికారులతో సమీక్ష చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రతి కేసులో ఆధునిక సాంకేతికతతో పాటు టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించి కన్విక్షన్ రేటు పెంచాలని ఆదేశించారు. పీజీఆర్‌ఎస్ ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు, మహిళల భద్రతకు గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓపెన్ డ్రింకింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని తెలిపారు. రౌడీ షీటర్లపై నిరంతర నిఘా, గ్రేవ్ కేసుల్లో నిర్ణీత గడువులో చార్జ్‌షీట్లు దాఖలు చేయాలని స్పష్టం చేశారు. అలాగే బ్లాక్ స్పాట్లలో డ్రోన్ సర్వైలెన్స్, గ్రామ సందర్శనలు, రాత్రి గస్తీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.
