Home Politics Andhra Pradesh బాలికల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచిన డ్రోన్ టెక్నాలజీ శిక్షణ

బాలికల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచిన డ్రోన్ టెక్నాలజీ శిక్షణ

0

ప్రధానమంత్రి ఉషా పథకం కింద జి ఐ ఇ ఐ స్కీమ్ ద్వారా,మర్రిపాలెం ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో ఫిబ్రవరి 18వ తేదీన ప్రారంభమైన 7 రోజుల డ్రోన్ టెక్నాలజీ శిక్షణ కార్యక్రమం ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి సిఎంఎస్ లెబోరా్టోరీస్ ఆధ్వర్యంలో శిక్షణ నిర్వహించబడింది .
ఈ కార్యక్రమానికి చైర్‌పర్సన్‌గా డాక్టర్ వి చిట్టిబ్బాయి వ్యవహరించగా, కన్వీనర్‌గా కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. సుధ సమగ్ర పర్యవేక్షణ చేశారు. ఆమె మార్గదర్శకత్వంలో అధ్యాపకులు, కోఆర్డినేటర్లు, విద్యార్థినులు సమన్వయంతో శిక్షణను విజయవంతంగా నిర్వహించారు. ప్రతి తరగతిని స్వయంగా పరిశీలిస్తూ, తరగతులు సజావుగా కొనసాగేందుకు కృషి చేశారు.
ఈ శిక్షణకు రిసోర్స్ పర్సన్‌గా శివ కార్తికేయ సీఈఓ , కేడర్ హరి హేమ డ్రోన్ టెక్నాలజీ మరియు ఏరోలన్స్ టెక్నాలజీ పాల్గొని విద్యార్థినులకు ప్రాక్టికల్ మరియు థియరీ శిక్షణ అందించారు. డ్రోన్ పైలట్ మరియు ప్రొఫెషనల్ డ్రోన్ ఫోటోగ్రాఫర్ కూడా వాలెడిక్టరీ కార్యక్రమంలో పాల్గొని, విద్యార్థినులకు భవిష్యత్తులో ఎలా అభివృద్ధి చెందాలో సూచనలు అందించారు. పైలట్ ఇంజినీర్ చిరాగ్ సర్ డ్రోన్లలో కలిగే సాధారణ లోపాలను ఎలా గుర్తించి, ఎలా మరమ్మతులు చేయాలో వివరించారు.
ఈ కార్యక్రమానికి ఫిజిక్స్ లెక్చరర్ డా. రాజబాబు కోఆర్డినేటర్‌గా పనిచేసి, ప్రతిరోజూ విద్యార్థినుల హాజరు, అవసరాలు, నిర్వహణ అంశాల్లో అహర్నిశలు శ్రమించారు. ఇంగ్లీష్ లెక్చరర్ డా. జి. మేరీ పుష్ప కార్యక్రమం సాఫల్యానికి తోడ్పాటునందించారు. సి ఎం ఎస్ చంటి బాబు మరియు లలిశ అన్ని ఏర్పాట్లలో సహకరించారు.
ఈ 7 రోజుల శిక్షణలో విద్యార్థినులు విశేషంగా పురోగతి సాధించారు. మొదట్లో ఉన్న భయాన్ని అధిగమించి, ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించుకున్నామని వారు తెలిపారు. కొందరు విద్యార్థినులు “బంగారు పతకం సాధించిన ఆనందం కంటే ఈ శిక్షణ ద్వారా పొందిన జ్ఞానం, నమ్మకం మరింత ఆనందాన్నిచ్చింది” అని అభిప్రాయపడ్డారు. ఒక విద్యార్థిని డ్రోన్ ఎగరేస్తూ ఎంతో ఆనందంగా అనిపించిందని, రైతుగా ఉన్న తన తండ్రికి ఒక డ్రోన్ కొనివ్వాలని సంకల్పించిందని తెలిపింది.
ఆదివాసీ ప్రాంతాల బాలికలు అకాడెమిక్ చదువుల్లోనే కాకుండా ఆధునిక సాంకేతిక రంగాల్లోనూ రాణించగలమని ఈ శిక్షణ ద్వారా నిరూపించామని విద్యార్థినులు గర్వంగా పేర్కొన్నారు.
కార్యక్రమం చివరలో రిసోర్స్ పర్సన్ శివ కార్తికేయ ప్రేరణాత్మక ప్రసంగం అందించగా, జాతీయ గీతం “జనగణమన” ఆలపనతో కార్యక్రమం ఘనంగా ముగిసింది. భవిష్యత్తులో డ్రోన్ టెక్నాలజీలో మరింత అభివృద్ధి సాధించాలని విద్యార్థినులు ప్రతిజ్ఞ చేశారు.
ఈ శిక్షణ కార్యక్రమం కళాశాల చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version