Home Politics Andhra Pradesh డాక్టర్ ఆర్ ఎస్ ఎస్‌కు శ్రీకృష్ణదేవరాయ సేవా రత్న జాతీయ పురస్కారం

డాక్టర్ ఆర్ ఎస్ ఎస్‌కు శ్రీకృష్ణదేవరాయ సేవా రత్న జాతీయ పురస్కారం

0

బ్రహ్మంగారి మఠం తోటపల్లి గ్రామంలోని శ్రీ అచలానంద ఆశ్రమంలో ఘనంగా రాయల జాతీయ మహాకవి సమ్మేళనం మరియు శ్రీకృష్ణదేవరాయ సేవారత్న జాతీయ పురస్కార ప్రధాన కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమాన్ని చైర్మన్ అల్లం రంగనాయకులు, అధ్యక్షులు బొల్లు రామ్మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సభకు మాజీ రాజ్యసభ సభ్యులు ఎన్ తులసి రెడ్డి, సంస్కృతి స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి ఒంటెరు శ్రీనివాసులు రెడ్డి, అలాగే విరజానంద స్వామి తదితర విశిష్ట అతిథులు హాజరయ్యారు.
కవుల సమక్షంలో స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ ఎస్ ఎస్‌కు శ్రీకృష్ణదేవరాయ సేవారత్న జాతీయ పురస్కారం అందజేయబడింది.
ఈ సందర్భంగా డాక్టర్ ఆర్ ఎస్ ఎస్ మాట్లాడుతూ, భవిష్యత్తులో దేశీయ గోవుల స్వచ్ఛమైన గోమూత్రానికి పాలకంటే అధిక ధర లభించే అవకాశముందని తెలిపారు. ప్రస్తుతం తన పరిశోధనలో భాగంగా దేశీయ గోమూత్రంతో తయారు చేస్తున్న ఔషధాలు వ్యవసాయ రంగంలో మంచి ఫలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో గోమూత్రం ఆధారంగా మరిన్ని వ్యవసాయ మరియు పర్యావరణ అనుకూల ఔషధాలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
అదేవిధంగా, డాక్టర్ ఆర్ ఎస్ ఎస్ రచించిన “చీని, బత్తాయి, నిమ్మ” పుస్తకాన్ని వేదికపై ఉన్న ప్రముఖుల చేతుల మీదుగా ఆవిష్కరించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version