Home Politics Andhra Pradesh డాక్టర్ కందుల సేవలు ప్రశంసనీయం

డాక్టర్ కందుల సేవలు ప్రశంసనీయం

0

విశాఖవ్యాప్తంగా విస్తరిస్తున్న సేవలు
నవ వధువుకు బంగారు తాళిబొట్టు అందజేసిన సిపి శంఖ బ్రత బాగ్చి

ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా, సంఘ సేవకునిగా ప్రజలకు విశేషంగా సేవలు అందిస్తూ ఎంతోమంది అభిమానాన్ని పొందిన వ్యక్తి డాక్టర్ కందుల నాగరాజు అని విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి కొనియాడారు.
గ్రీవియన్సీలో భాగంగా తనను కలిసిన నవవధువును సిపి ఆశీర్వదించారు.
విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో సీతమ్మ పేటకు చెందిన నవ వధువు త్రివేణికి సిపి చేతుల మీదుగా బంగారు తాళిబొట్టు, పట్టుబట్టలు, పసుపు కుంకుమ అందజేశారు.
ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవ చేస్తూ అందరి హృదయాలలో డాక్టర్ కందుల నాగరాజు చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు.
తన వద్దకు సహాయం కోసం ఎవరు వచ్చినా సరే తక్షణమే వారికి సహాయం చేయడం ఆయనకు అలవాటని ప్రశంసించారు.
ఈ రోజులలో కూడా ఇలా నిస్వార్ధంగా సేవలు అందిస్తూ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండే నాయకుడు ఎవరు లేరని అభినందించారు.
భవిష్యత్తులో కూడా ఆయన సేవా కార్యక్రమాలు కొనసాగాలని ఆకాంక్షించారు.
డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ నవ వధువుకు సిపి ఆశీర్వాదాలు అందించడం చాలా సంతోషమని చెప్పారు.
విశాఖ నగరానికి డాక్టర్ శంఖబ్రత బాగ్చి సిపిగా వచ్చినప్పటి నుంచి విశాఖలో శాంతి భద్రతలు నియంత్రణలో ఉన్నాయని తెలిపారు.
విధినిర్వహణలో ఒక ఉత్తమ అధికారిగా గుర్తింపు పొందిన ఆయన, సామాజిక సేవలో కూడా ముందు ఉంటూ పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో
కందుల కృష్ణ , శంకరావు , వర ,
శ్రీదేవి, కోదండమ్మ , హేమ , కుమారి తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version