జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పి హైమావతి సోమవారం చోడవరం మండలం గవరవరం పిహెచ్సిని సందర్శించార. ఈ సందర్భంగా పీహెచ్సీ నుంచి అందుతున్న ఆరోగ్య సేవలు గురించి ఆరా తీశారు. ముఖ్యంగా పీహెచ్సీకి వస్తున్న రోగులు, గర్భవతులు తదితరులకు అందరికీ కూడా అభ ఐడిని క్రియేట్ చేయమని సూచించారు. దీనిలో భాగంగా ఫార్మసీ రూమ్ పరిశీలించారు. రక్త పరీక్షలు ల్యాబ్ లో ఎన్ని రకాల రక్త పరీక్షలు జరుగుతున్నాయీ వంటి వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా సిబ్బందికి తగు సూచనలు చేశారు అనంతరం వైద్యాధికారులు యూఎస్బీ ప్రదీప్ , డాక్టర్ మేఘన సిహెచ్ఓ శ్యామకసల్, హెచ్ వి రత్నం, హెచ్ ఎస్ బి త్రిమూర్తులు తదితరులతో ఆమె సమావేశమయ్యారు.
