Home Politics Andhra Pradesh అక్రమంగా తరలిసితున్న 185 కేజీల గంజాయి పట్టివేత.

అక్రమంగా తరలిసితున్న 185 కేజీల గంజాయి పట్టివేత.

0

కొయ్యురు,మంప పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిసితున్న 185 కేజీల గంజాయి పట్టుకున్నట్లు కొయ్యురు సి ఐ శ్రీనివాస్ తెలిపారు.
ముందస్తు సమాచారం మేరకు కొయ్యూరు ఏస్ ఐ పి. కిశోర్ వర్మ తమ సిబ్బందితో కలిసి కొయ్యూరు మండలం చీడిపాలెం జంక్షన్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు.సుమారు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో బూదరాళ్ళ వైపు నుండి వస్తున్న వాహనం పోలీసులు తనిఖీ చేయగా వారి వద్ద నుండి ప్యాక్ చేసిన 83 గంజాయి ప్యాకెట్లు కనుగొన్నారు. తూకం వేయగా మొత్తం సుమారు 182 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు.మంప స్టేషన్ పరిధిలో అక్రమ రవాణా జరుగుతుందనే విశ్వసనీయ సమాచారం పై భూదరాళ్ళ గ్రామ శివారులో వాహన తనిఖీలు నిర్వహించారు.
సుమారు ఉదయం పది గంటల సమయంలో స్కూటీపై ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు వస్తుండగా పోలీసులను చూసి వాహనాన్ని తనిఖీ చేయగా వారి వద్ద ఉన్న సంచిలో 3కిలోల గంజాయి ని స్వాధీనం చేసుకున్నమన్నారు.
పట్టుబడిన నిందితులు
జగరపు సాయికుమార్,
పులిగా విజయరాజ్ వారి వద్దనుండి స్కూటీ మరియు రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నాము అన్నారు..

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version