అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ లో ఘనంగా జరుగుతున్న అరకు ఉత్సవాలు లో భాగంగా నిర్వహించిన కార్నివాల్ అందరిని ఆకట్టుకుంది. కార్నివాల్ లో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, పాడేరు ఐటిడిఏ పీఓ తిరుమణి శ్రీ పూజ, అసిస్టెంట్ కలెక్టర్, ప్రజా ప్రతినిధులు సినీ పాటలకు వేసిన స్టెప్పులు స్థానికులు, పర్యాటకుల్లో ఉత్సాహం నింపింది. స్థానిక గిరిజన మ్యూజియం నుండి ప్రధాన రహదారి మీదుగా కొనసాగిన కార్నివాల్ ఆధ్యాంతం ఉర్రుతలూగించింది. కాగా అరకులోయ లో రెండు రోజులుగా జరుగుతున్న అరకు ఉత్సవాలు అద రహో అనిపిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అరకు ఇన్చార్జి విజయనగరం జోన్ చైర్మన్ సియ్యారి దొన్ను దొర స్థానిక టిడిపి పార్టీ శ్రేణులతో పాల్గొని సినీ పాటలకు సంస్కృతిక నృత్యాలకు డాన్స్ చేశారు
