Home News 50వ డివిజన్‌లో రూ.1.60 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

50వ డివిజన్‌లో రూ.1.60 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

0

ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
నగరంలో అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. స్థానిక 50వ డివిజన్ గ్లో గార్డెన్ పరిసర ప్రాంతాల్లో రూ.1 కోటి 60 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన స్థానిక నాయకులతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుమారు 855 రన్నింగ్ మీటర్ల సీసీ రోడ్డు, 300 రన్నింగ్ మీటర్ల బిటుమెన్ రోడ్డు, అలాగే 300 మి.మీ. మరియు 450 మి.మీ. సైజుల్లో 265 రన్నింగ్ మీటర్ల సీసీ డ్రైనేజ్‌లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యంతో డ్రైనేజ్ సమస్యలు తలెత్తాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మేజర్ డ్రైన్ నిర్మాణం ద్వారా శాశ్వత పరిష్కారం చేపట్టామని చెప్పారు. ఇప్పటికే ఈ డివిజన్‌లో రూ.1.10 కోట్ల పనులు పూర్తి కాగా, భాస్కర్ నగర్‌లో మరో రూ.2.22 కోట్ల పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. మొత్తం రూ.3.33 కోట్లతో అభివృద్ధి జరుగుతోందన్నారు. గ్లో గార్డెన్, చౌడేశ్వర నగర్‌లో పార్కుల అభివృద్ధితో ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. అనంతరం డివిజన్‌లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version