Home Politics Andhra Pradesh సంతూర్ , రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్షిప్స్ కు డిగ్రీ కళాశాల విద్యార్థినిల ఎంపిక

సంతూర్ , రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్షిప్స్ కు డిగ్రీ కళాశాల విద్యార్థినిల ఎంపిక

0

చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి బిఏ చదువుతున్న బాలికలలో మొత్తం 24 మంది విప్రో సంస్థ అందించే విప్రో- సంతూర్ ఉమెన్స్ స్కాలర్షిప్స్ కార్యక్రమానికి ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ డాక్టర్ పి. కిరణ్ కుమార్ శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో తెలిపారు. వీరికి ఒక్కొక్కరికి ఏడాదికి 30 వేల చొప్పున మొత్తం మూడు ఏళ్లు పాటు 90 వేల రూపాయలు స్కాలర్షిప్స్ గా అందించబడతాయన్నారం అలాగే రిలయన్స్ ఫౌండేషన్ వారు దేశవ్యాప్తంగా అందించే 5000 స్కాలర్షిప్స్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల బీఎస్సీ కంప్యూటర్స్ మొదటి సంవత్సరం చదువుతున్న వై ధనలక్ష్మి అనే విద్యార్థిని ఎంపికయింది. ఈ విద్యార్థినికి సంవత్సరానికి 50వేల చొప్పున మొత్తం మూడు సంవత్సరాలకు 1,50,000 వేల రూపాయలు అందించబడతాయన్నారు.ఈ స్కాలర్షిప్స్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుకునే విద్యార్థినులకు మాత్రమే అందిస్తారని , కాబట్టి రాబోయే విద్యా సంవత్సరానికి (2026-27) చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరాలనుకునే విద్యార్థినులు మరింత ఎక్కువమంది ఈ సంతూర్ ఉమెన్స్ స్కాలర్షిప్స్ పొందాలని ప్రిన్సిపాల్ ఆకాంక్షించారు. తల్లిదండ్రులు ఈ స్కాలర్షిప్స్ ను విద్యార్థినిల ఉన్నత చదువులకి వినియోగించాలని కోరారు. స్కాలర్షిప్ పొందిన విద్యార్థినులను అధ్యాపకులు అభినందించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version