Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradeshరాధాకృష్ణపై వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

రాధాకృష్ణపై వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

– అరెస్టు చేయాలంటూ వైసీపీ నేతల డిమాండ్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంపై ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన వ్యాసం వివాదానికి దారితీసింది. ఆ పత్రిక ఎడిటర్ వేమూరి రాధాకృష్ణ మహిళలు, వైఎస్ఆర్సిపి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ వైసీపీ నేతలు తీవ్రంగా స్పందించారు.
ఈ నేపథ్యంలో గురువారం స్థానిక వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో వైసీపీ శ్రేణులు సబ్ ఇన్స్పెక్టర్ కేశవకు ఫిర్యాదు పత్రం సమర్పించారు. ఎడిటర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుని వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు.
వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి మాట్లాడుతూ, పత్రికా స్వేచ్ఛ పేరుతో మహిళల గౌరవాన్ని దెబ్బతీయడం అసహ్యకరమని అన్నారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. రాధాకృష్ణ మహిళలకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
అలాగే, వైసీపీ సీనియర్ నాయకుడు వాసంశెట్టి గంగాధరరావు మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు పార్టీ మహిళల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని చెప్పారు. వెంటనే క్షమాపణ చెప్పకపోతే మరింత చట్టపరమైన చర్యలకు దిగుతామని హెచ్చరించారు.
ఫిర్యాదుతో పాటు సంబంధిత వ్యాఖ్యల సాక్ష్యాలుగా పెన్‌డ్రైవ్‌ను పోలీసులకు అందజేసినట్లు నేతలు తెలిపారు. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయిస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు మార్తి నాగేశ్వరరావు, మజ్జి అప్పారావు మార్గాని సురేష్, రజనీకాంత్, అరే చిన్ని, తిరగాటి దుర్గారావు, బిల్డర్ చిన్నా, రొక్కం త్రినాథ్, సప్ప ఆదినారాయణ, దుర్వాసుల సత్యనారాయణ, యజ్జవరపు శ్రీను, నందం స్వామి, శాండీ, అందనపల్లి సత్యనారాయణ, ఉమా యాదవ్, ఇమ్రాన్, బబ్లూ, గౌరీ శంకర్, కటకం చిన్నా, గుడివాడ అప్పారావు, వట్టికూటి కృష్ణ వేణి, అనురాధ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments