మహిళల పట్ల ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు గురువారం మాజీ మంత్రి, ఉభయ గోదావరి జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త గుడివాడ అమర్నాథ్ పిలుపుతో వైఎస్ఆర్సిపి చోడవరం పట్టణ మండల నాయకులు మహిళా నాయకులు కలిసి చోడవ రం కొత్తూరు జంక్షన్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు అందజేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తప్పుడు రాతలను కొత్త పలుకులు అనే అసభ్య పదజాలంతో వైఎస్ఆర్సిపి నాయకులు అధినేత కార్యకర్తల భార్యలను కార్యకర్తలను తప్పుడు పదజాల రాతలు మాటలు పలికిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసన తెలిపారు. గుడివాడ అమర్నాథ్ తో పాటు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఏడువాకా సత్యారావు, చందు రాంబాబు, పుల్లేటి వెంకటేష్ పందిరి శ్రీను, చోడవరం పట్టణ అధ్యక్షులు దేవరపల్లి సత్య, అత్తిలి జగన్, దొండ రాంబాబు జడ్పిటిసి వడ్డాది, ఓరుగంటి నెహ్రూ, చిటికెల నాగేష్, వర్జుల ప్రకాష్ రావు, దూది సత్తిబాబు, బగ్గు శ్యామలమ్మ, అల్లాడ భవాని, ఎంపీటీసీ అరుణ, ఎంపీపీ గాడి కాసులమ్మ , గాడి అప్పారావు (గాంధీ గ్రామం సర్పంచ్ ) బొడ్డేటి సూర్యనారాయణ, పల్లా నర్సింగరావు, వేంపల్లి ఆనంద్, ఎం నర్సింగరావు, బొడ్డు శ్రీరామ్ మూర్తి, గూ నూరు రామకృష్ణ, బలిరెడ్డి నాగమణి, పల్లా ధనాజీ, అనిల్ ఐటీ వింగ్, మనోహర్, రోహిత్, యువజన విభాగ నాయకులు) ఉప్పల బాబు, కందర్ప శంకర్, పి ఎస్ పేట సూర్యప్రకాష్, గరిక గోవింద, దన్నిన వెంకట్రావు, బంగారం పాలెం నరసింహమూర్తి వార్డ్ మెంబర్, గుమ్మిడి శ్రీను, సిహెచ్ బాబురావు ఎస్ పేట,మరియు మండల నాయకులు పట్టణ నాయకులు పాల్గొన్నారు.
