Home Politics Andhra Pradesh పంట నష్టపోయిన జీడీ రైతులకు పరిహారం చెల్లించాలి

పంట నష్టపోయిన జీడీ రైతులకు పరిహారం చెల్లించాలి

0

జీడి చెట్లు పూత వచ్చి పూర్తిగా జీడి పూత ఎండిపోయిందని పూత ఎండిపోవడంతో పంట నష్టం జరిగిందని కూటమి ప్రభుత్వం జీడు రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ మంగళవారం మాడుగుల మండలం శంకరం పంచాయతీ కృష్ణం పాలెం లో గిరిజనులు ఆందోళన చేపట్టారు. వీరికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ ఆదివాసి గిరిజన సంఘం ఐదోవ షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరట నరసింహమూర్తి, వ్వవసాయ కార్మికసంఘం జిల్లా ఉపాద్యాక్షురాలు కె.భవాని మాట్లాడారు.
ఈసంవత్సరం అకాల వర్షాలు వల్ల,మంచు తెగులుతో జీడీతోటలు పూర్తిగా నాశనమయ్యాయని తెలిపారు.ఈ సంవత్సరం కాలం జీడి పైనె అదార పడ్డ గిరిజన రైతులు అప్పులు పాలు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు ఎకారకు 30 వేలు చప్పున నష్టం పరిహరం చేల్లించాలని డిమాండ్ చేసారు,
పంటలను కూటమి ప్రభుత్వ గుర్తించక పోవడం దారుణ మన్నారు కోద్దిగోప్పో ఉన్న జీడీ పిక్కలకు మద్దతు ధర కేజీ 200 రూ/-ప్రకటించి రైతు సేవ కేంద్రాలు ద్వారా కోను గోలు చేయాల అన్నారు గత 5 సంవత్సరం నుండి వాతావరణ మార్పులు ఉష్ణో గ్రతలు పొగ మంచు,తెగుళ్లు పిండినల్లి వంటి తదితర విపత్తులు వల్ల పూత, పింజ దెబ్బతిని తీవ్ర నష్టాలకు గురయ్యారని పేర్కొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version